కుంటకు మావోయిస్టుల మృతదేహాలు
హైదరాబాద్: మీడియా కంట పడకుండా ఖమ్మం జిల్లా చర్ల మండలంలో జరిగిన ఎన్ కౌంటర్ మృతుల దేహాలను ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లా కుంటకు తరలించారు. సంఘటనా స్థలానికి మీడియా ప్రతినిధులను అనుమతించినట్లే అనుమతించి గుట్టుగా మృతదేహాలను తరలించింది. ఖమ్మం జిల్లా చర్ల మండలంలో జరిగిన ఎన్ కౌంటరులో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉండవచ్చునని భావిస్తున్నారు.
మావోయిస్టుల కాల్పులకు ప్రతిగానే పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని ఖమ్మం పోలీసు సూపరింటిండెంట్ చౌహాన్ అంటున్నారు. మృతదేహాలను ఇంకా గుర్తించలేదని ఆయన చెప్పారు. మృతుల్లో ఎవరెవరున్నారో ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. మృతదేహాలను భద్రపరచాలని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రముఖ విప్లవ కవి వరవరరావు లంచ్ మోషన్ వేశారు. ఫోరెన్సిక్ నిపుణుల చేత పోస్టుమార్టం నిర్వహించాలని వరవరరావు కోరారు. మావోయిస్టుల ఆచూకీని పోలీసులకు తెలియజేసింది తామేనని ఛత్తీస్ ఘడ్ లోని సల్వజుడుం నేత ఒకరు ఒక తెలుగు ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు.












Click it and Unblock the Notifications