మృతుల్లో మావోయిస్టు అగ్రనేత చంద్రన్న?
ఖమ్మం: ఆంధ్రా - ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దులో మరణించిన 17 మంది మావోయిస్టుల్లో నలుగురిని గుర్తించారు. మృతుల్లో దంతేవాడ జిల్లా కార్యదర్శి గాజర్ల అశోక్, దళం డిప్యూటీ కమాండర్ కృష్ణస్వామి, ఖమ్మం జిల్లా కార్యదర్శి యాదగిరి అలియాస్ సాగర్, ఆయన కూతురు మయూరి అలియాస్ వెన్నెల ఉన్నారు. మృతుల్లో మావోయిస్టు చంద్రన్న కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్న ఉత్తర తెలంగాణ జోన్ కమిటీ కార్యదర్శి.
మావోయిస్టుల మృతదేహాలను బుధవారంనాడు దంతేవాడ జిల్లాలోని కుంటకు తరలించారు. ఆ మృతదేహాలకు అక్కడే అంత్యక్రియలు జరుగుతాయి. ఎన్ కౌంటర్ పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయనే పోలీసుల వాదనను విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకుడు వరవరరావు ఖండిస్తున్నారు. మావోయిస్టులకు విషం పెట్టి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications