అందాల నటుడు శోభన్ బాబు ఇక లేరు

Shoban Babu
చెన్నై: ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు ఇక లేరు. నట భూషణ శోభన్ బాబు గురువారం ఉదయం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. యోగా చేస్తుండగా ఆయన హఠాత్తుగా కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన వయస్సు 71 ఏళ్లు. భక్త శబరి సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన శోభన్ బాబుకు అందాల నటుడిగా పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆయనకు ఎనలేని అభిమానులున్నారు. ఇటీవల చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన నటించిన చివరి సినిమా అడవి దొర.

వీరాభిమన్యు సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనాచలపతి రావు. ఆయన 1937 జనవరి 14వ తేదీన కృష్ణా జిల్లా చిననందిగామ గ్రామంలో జన్మించారు. మొదట ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చిన శోభన్ బాబు 1965 వచ్చిన వీరాభిమన్యుతో సోలో హీరోగా నిలదొక్కుకున్నారు. గోరింటాకు, మల్లెపువ్వు, శారద, బలిపీఠం, ముందడుగు, కార్తీక దీపం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఆయనకు ఐదు సార్లు నంది అవార్డులు వచ్చాయి. నాలుగు సార్లు ఆయన ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. తన సమకాలీన నటుడు కృష్ణతో కలిసి ఆయన మంచిమిత్రులు, కురుక్షేత్రం వంటి సినిమాల్లో నటించాడు. ఏ మాత్రం బేషిజాలు లేని నటుడిగా శోభన్ బాబుకు పేరుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+