కన్నీరు పెట్టిన వాణిశ్రీ, చంద్రమోహన్
హైదరాబాద్: సినీ నటుడు శోభన్ బాబు మృతికి అలనాటి హీరోయిన్ వాణిశ్రీ కన్నీరు పెట్టుకున్నారు. శోభన్ బాబు మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని ఆమె అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు శోభన్ బాబు మృతి తీరని లోటు అని ఆమె అన్నారు. శోభన్ బాబు మృతికి మరో నటి శారద కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శోభన్ బాబుతో కలిసి ఆమె బలిపీఠం వంటి హిట్ చిత్రాల్లో నటించారు. జీవన తాత్వికతను శోభన్ బాబు వివరిస్తూ ఉండేవారని వాణిశ్రీ అన్నారు. శోభన్ బాబు మరణ వార్త విని సినీ పరిశ్రమ యావత్తు శోకసముద్రంలో మునిగిందని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు.
తాను పెద్దన్నయ్యను కోల్పోయానని సినీ నటుడు చంద్రమోహన్ అన్నారు. శోభన్ బాబు మరణవార్త విని ఆయన కన్నీరు మున్నీరు అయ్యారు. జీవితంలో తనకు శోభన్ బాబు ఎంతో మేలు చేశారని ఆయన అన్నారు. తాను తల్లిదండ్రులు పోయినప్పుడు కూడా తనకు ఇంత బాధ కలుగలేదని ఆయన అన్నారు. సినీ పరిశ్రమలో శోభన్ బాబును మించిన మంచి వ్యక్తి లేడని ఆయన అన్నారు. దేవుడిచ్చిన అన్యయ్య శోభన్ బాబు అని ఆయన అన్నారు. తాను నిన్ననే ఫోనులో మాట్లాడానని, శోభన్ వద్దకు వెళ్లేందుకు తాను సిద్ధపడుతున్న సమయంలో ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications