చెన్నై:
తెలుగు
సినీ
నటుడు
మోహన్
బాబు
పర్సనల్
అసిస్టెంట్
(పిఎ)
వెంకటరెడ్డే
తనకు
వీసా
ఇప్పించాడని
నకిలీ
వీసా
కుంభకోణంలో
ఇరుక్కున్న
సినీ
నటి
ఆశాషైనీ
అన్నారు.
నకిలీ
వీసాల
కుంభకోణంలో
తనకు
ఎలాంటి
సంబంధం
లేదని
ఆమె
బుధవారం
మీడియా
ప్రతినిధుల
సమావేశంలో
అన్నారు.
ఈ
కేసులో
ఆమె
అరెస్టై
షరతులతో
కూడిన
బెయిలుపై
విడుదులైన
విషయం
తెలిసిందే.
తనకు
వెంకటరెడ్డే
వీసా
ఇప్పించాడని
ఆమె
చెప్పారు.
శ్రీలతతో
తనకు
పరిచయం
లేదని,
ఆమెకు
కూడా
వెంకటరెడ్డే
వీసా
ఇప్పించాడని
ఆశాషైనీ
చెప్పారు.
వెంకటరెడ్డి
మోహన్
బాబు
వద్ద
పదేళ్లుగా
పిఎగా
పనిచేస్తున్నాడని,
వెంకటరెడ్డి
తనకు
అక్కడే
పరిచయమని
ఆమె
చెప్పారు.
మోహన్
బాబు
వద్ద
పిఎగా
పనిచేస్తున్న
వెంకటరెడ్డి
తనకు
ఫోన్
చేసి
అమెరికాలో
తెలుగువారు
నిర్వహించే
కార్యక్రమంలో
పాల్గొనాలని,
మరో
ఇద్దరిని
తనతో
పాటు
తీసికెళ్లాలని
చెప్పాడని,
అందుకు
తాను
అంగీకరించారని
ఆమె
చెప్పారు.
ఉగాది
సందర్భంగా
అమెరికాలో
జరిగే
తెలుగు
కార్యక్రమంలో
పాల్గొనడానికి
వెళ్తుండగా
తాను
తొలిసారి
పట్టుబడ్డానని
ఆమె
చెప్పారు.
ఇప్పటి
వరకు
తనంతతాను
ఎప్పుడూ
అమెరికాకు
వెళ్లలేదని
ఆమె
చెప్పారు.
వెంకటరెడ్డి
సాదాసీదా
ఏజెంటు
కాడని,
ఘనాపాటి
అని
ఆమె
వ్యాఖ్యానించారు.