టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. ఆర్బీ చౌదరి అంటేనే సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ కు చిరునామా. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అనేక విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. 1900 దశకం నుంచి 2000 ప్రారంభం వరకూ ఆయన నిర్మించిన చిత్రాలు ఎన్నో సూపర్ సక్సెస్ అయ్యాయి.

తెలుగులో రాజా, సూర్యవంశం, శివమణి, శంఖం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఆర్బీ చౌదరి నిర్మించారు. ఇక ఆయన కుమారులు జీవా కూడా తెలుగులో రంగం లాంటి సూపర్ హిట్ సినిమాలో హీరోగా నటించారు. ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లోనూ జీవా నటించారు. ఆర్బీ చౌదరి మృతితో టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. ఆయన మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

RBChoudary death news Tollywood Mourns Veteran Producer RB Choudary Dies in Tragic Road Accident

మరోవైపు అటు మలయాళ చిత్ర పరిశ్రమలోనూ తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ ఇవాళ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను మూశారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య రాజ్యలక్ష్మి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది. ఇక వీరి మరణవార్త సినీ ఇండస్ట్రీలో తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+