డేవిడ్ మిల్లర్ బిగ్ స్టేట్‌మెంట్.. రిటైర్మెంట్ డేట్ ఫిక్స్!

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తన అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్లాన్ గురించి కీలక ప్రకటన చేశాడు. 2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలిచి.. ఆ విజయోత్సవంతోనే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు డేవిడ్ మిల్లర్ తెలిపాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు జరగనుంది.

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ లో అనూహ్య పరిణామం: ఢిల్లీ వేదికగా..
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ లో అనూహ్య పరిణామం: ఢిల్లీ వేదికగా..

ఇప్పటివరకు దక్షిణాఫ్రాకా జట్టు ఒక్కసారి కూడా వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని గెలవలేకపోవడం గమనార్హం. 2023 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో సెమీ ఫైనల్స్‌లో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో జియోస్టార్ తో మాట్లాడిన డేవిడ్ మిల్లర్.. సొంతగడ్డపై జరిగే 2027 ప్రపంచ కప్ గెలిచి తన సుదీర్ఘ కెరీర్‌ను ఓ వరల్డ్ కప్ ట్రోఫీతో ముగించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నాడు. వరల్డ్ కప్ జట్టులో స్థానంలో సంపాదించి.. బెస్ట్ ఇవ్వడంపైనే ప్రస్తుతం తాను దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించాడు.

David Miller Announces Retirement Plan Aims to Win 2027 World Cup Before Quitting Full Details Here

ఎంతో కాలంగా దక్షిణాఫ్రికా జట్టులో ఫినిషర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డేవిడ్ మిల్లర్.. ఒత్తిడితో కూడిన మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేయడం, మ్యాచ్‌లను విజయవంతంగా ముగించడాన్ని నేర్చుకోవడం ఓ ప్రత్యేకమైన విద్య అని తెలిపాడు. 'ద హండ్రెడ్ 2026' టోర్నీలో సదరన్ బ్రేవ్ తరఫున 8 మ్యాచ్‌లలో 166 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్.. ఛేజింగ్ సమయంలో బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తానని.. నేటికీ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నానని స్పష్టం చేశాడు.

హార్దిక్ విషయంలో జాగ్రత్త పడండి: పాండ్యా కోసం అతన్ని వదులుకోవద్దు
హార్దిక్ విషయంలో జాగ్రత్త పడండి: పాండ్యా కోసం అతన్ని వదులుకోవద్దు

డేవిడ్ మిల్లర్ తన ఐపీఎల్ ప్రయాణంలో 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున టైటిల్ గెలవడమే అత్యంత చిరస్మరణీయ క్షణమని గుర్తుచేసుకున్నాడు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై చేసిన 101* పరుగుల ఐపీఎల్ సెంచరీ, డర్బన్‌లో ఆస్ట్రేలియాపై ఛేజింగ్ లో చేసిన 118* పరుగుల ఇన్నింగ్స్‌లు తన హృదయానికి అత్యంత దగ్గరైన చిరస్మరణీయమైనవని.. ఈ రెండూ ఒత్తిడిలో వచ్చి తన కెరీర్ కు కీలక మలుపులుగా నిలిచాయని డేవిడ్ మిల్లర్ చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+