కార్తీక దీపం వివాదం: సుప్రీంకోర్టు గడప తొక్కిన దళపతి విజయ్ ప్రభుత్వం!

తమిళనాడులోని మదురైలో గల తిరుపరంకుండ్రం కొండపై పురాతన కార్తీక దీపం వెలిగించే సంప్రదాయానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. తిరుపరంకుండ్రం కొండపై ఉన్న పవిత్ర రాతి స్తంభం 'దీపాథూన్'పై కార్తీక దీపం వెలిగించేందుకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన అనుమతిపై తక్షణమే స్టే విధించాలని కోరుతూ మంగళవారం సుప్రీంకోర్టులో రాష్ట్ర సర్కారు వాదనలు వినిపించింది. ఒకవేళ హైకోర్టు ఆదేశాలను నిలిపివేయకపోతే రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తి.. శాంతిభద్రతల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

దటీజ్ విజయ్..! ప్రియాంక అడగ్గానే ఏమాత్రం కాదనకుండా..!
దటీజ్ విజయ్..! ప్రియాంక అడగ్గానే ఏమాత్రం కాదనకుండా..!

సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు
మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై అత్యవసర విచారణ జరిపి తక్షణ స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన ధర్మాసనం మంగళవారం సుమారు గంటన్నర పాటు వాదనలు విన్నది. దీపం వెలిగించేందుకు అనుమతించిన ప్రదేశం వివాదాస్పదమైనదని, అక్కడ కార్తీక దీపం వెలిగించే సంప్రదాయం ఎన్నడూ లేదని తమిళనాడు ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా కోర్టుకు తెలిపారు. "దీపాథూన్ వద్ద దీపం వెలిగించే ఆచారం లేదు. గతంలో మద్రాస్ ఉన్నత న్యాయస్థానం కూడా ఈ డిమాండ్‌ను తిరస్కరించింది. ఉచ్చి పిళ్లయార్ ఆలయానికి సమీపంలోని దీప మండపంలోనే దీపం వెలిగించడం సంప్రదాయమని ఆలయ అర్చకుల కూడా స్పష్టం చేశారు. దర్గాను ఆనుకుని ఉన్న దీపాథూన్ స్తంభంపై దీపం వెలిగించే ఆచారం లేదు" అని ఆయన వాదించారు.

Thalapathy Vijay Govt Moves Supreme Court Against Karthigai Deepam on Thiruparankundram Hill

వందేళ్ల సంప్రదాయాన్ని మార్చడం ఎందుకు?
హిందూ మత, దేవాదాయ శాఖ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది శేఖర్ నఫాడే కూడా హైకోర్టు ఆదేశాలను వ్యతిరేకించారు. "వందేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది? ఆ ప్రదేశం దర్గాకు సమీపంలో ఉండటం వల్ల సున్నితమైనది. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తే గతంలో మాదిరిగానే మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉంది" అని పేర్కొన్నారు. 2025కు ముందు జరిగిన ఏ విచారణలోనూ 'దీపాథూన్' అనే పదం ప్రస్తావనకు రాలేదని మదురై జిల్లా కలెక్టర్ తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కోర్టు దృష్టికి తీసుకుళ్లారు.

Ind Vs NZ Test: న్యూజీలాండ్ తో టెస్టులకు బౌలింగ్ ప్లాన్ మార్పు- గిల్ ప్రకటన..!
Ind Vs NZ Test: న్యూజీలాండ్ తో టెస్టులకు బౌలింగ్ ప్లాన్ మార్పు- గిల్ ప్రకటన..!

కార్తీక పౌర్ణమికి ముందే స్టే కోసం పట్టు
ఈ ఏడాది నవంబర్ 24న కార్తీక పౌర్ణమి పర్వదినం రానుంది. అదే రోజు తిరుపరంకుండ్రం కొండపై ఉన్న 'దీపాథూన్' రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 24 లోపు మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై ఎలాగైనా స్టే సాధించాలని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

అసలేంటీ వివాదం? నేపథ్యం ఏమిటి?
తిరుపరంకుండ్రం కొండపై ఉన్న 'దీపాథూన్' రాతి స్తంభం, హజరత్ సుల్తాన్ సికిందర్ బాదుషా ఔలియా దర్గాకు కేవలం 50 మీటర్ల దూరంలో ఉంది. కొండ దిగువన ఉన్న అరుల్మిగు సుబ్రహ్మణ్యస్వామి ఆలయం తమిళనాడు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంది. 2025 డిసెంబర్‌లో మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి జీఆర్ స్వామినాథన్ దీపాథూన్‌పై భక్తులు కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చారు. దీపాథూన్‌పై దీపం వెలిగించడం వల్ల దర్గా హక్కులకు ఎలాంటి భంగం కలగదని, భక్తులను అడ్డుకోవడం వారి మతపరమైన హక్కులను ఉల్లంఘించడమేనని ఆయన తీర్పులో పేర్కొన్నారు. 2026 జనవరి 6న మదురై డివిజన్ బెంచ్ కూడా ఈ తీర్పును సమర్థించింది.

గత డీఎంకే ప్రభుత్వం మాదిరిగానే ఈ ఏడాది అధికారంలోకి వచ్చిన దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కూడా ఆలయ పరిపాలన తరఫున ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. జూన్ 11న మదురై బెంచ్ తీర్పును సవాలు చేస్తూ విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. గత 150 ఏళ్లుగా ఉచ్చి పిళ్లయార్ ఆలయ సమీపంలోని దీప మండపంలోనే దీపం వెలిగిస్తున్నారని, ఆ ఆచారాన్నే కొనసాగించాలని ప్రభుత్వం పట్టుబడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+