ఇంటెల్ లో భారీ కుదుపు.. !!

సెమీకండక్టర్ తయారీ దిగ్గజం ఇంటెల్ మరోసారి ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. గ్లోబల్ ఐటీ విభాగంపై తాజా కోతల ప్రభావం పడింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటెల్ చెబుతోంది. రెండేళ్లుగా వరుస లేఆఫ్స్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టెక్కీలకు ఈ తాజా నిర్ణయంమరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ విడతలో ఎంతమంది ఉద్యోగులు లేఆఫ్స్ బారిన పడతారనే విషయం స్పష్టత రావట్లేదు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా ప్రారంభమైన అనంతరం టెక్ రంగంలో ఎప్పటికప్పుడూ చోటు చేసుకుంటూ వస్తోన్న మార్పులు, ప్రాధాన్యతలకు అనుగుణంగా తమ వద్ద ఉన్న మానవ వనరులను సరిగ్గా ఉపయోగించుకోవడంలో భాగంగానే ఈ ప్రక్రియ చేపట్టామని, సంస్థను మరింత సమర్థవంతంగా, లాభదాయకంగా మార్చడమే తమ ప్రాథమిక లక్ష్యమని ఇంటెల్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

Intel has carried out fresh layoffs affecting its global IT workforce restructuring the chipmaker

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌ల తయారీ విభాగంలో ప్రత్యర్థి కంపెనీల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది.. ఇంటెల్. తన మార్కెట్ ఆధిపత్యాన్ని వేగంగా కోల్పోతోంది. నూతన చిప్‌ల ఉత్పత్తిలో ఎదురవుతున్న అడ్డంకులు, పెరుగుతున్న నిర్వహణ వ్యయం వంటివి.. సంస్థ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోన్నాయి. ఈ లోటును పూడ్చుకోవడంతో పాటు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనడానికి వీలుగా ఖర్చును తగ్గించుకునే పనిలో పడింది.

వెహికల్ ఇన్సూరెన్స్ లో భారీ మార్పులు: ఇకపై.. !!
వెహికల్ ఇన్సూరెన్స్ లో భారీ మార్పులు: ఇకపై.. !!

సంస్థను తిరిగి లాభాల బాట పట్టించడానికి ఇంటెల్ సీఈవో లిప్ బూ టాన్ నేతృత్వంలోని టీమ్ ప్రధాన ప్రాజెక్టుల వ్యయాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా 2025 నుంచి దశలవారీగా ఉద్యోగుల సంఖ్యను కుదించుకుంటూ వస్తోంది. డేటా సెంటర్ గ్రూప్ తో పాటు అమెరికాలోని ప్రధాన తయారీ ప్లాంట్లలో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు నేరుగా ప్రభావితం అయ్యారు. గత ఏడాది జూలైలో కాలిఫోర్నియా, ఒరెగాన్ ప్లాంట్లలో 5,000 లకు పైగా ఉద్యోగులను తొలగించింది.. ఇంటెల్.

పసిడి ధరలు పాతాళానికి- మరో మహా పతనం: 14 నెలల కనిష్టానికి
పసిడి ధరలు పాతాళానికి- మరో మహా పతనం: 14 నెలల కనిష్టానికి

ప్రపంచవ్యాప్తంగా ఈ తొలగింపుల సంఖ్య 24,000లకు పైమాటే. ఈ ఏడాది జులైలో డేటా సెంటర్ గ్రూప్ దీర్ఘకాలిక ప్రాధాన్యతల సాధన కోసం ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు తాజాగా గ్లోబల్ ఐటీ విభాగంలో కోతలను మొదలుపెట్టింది. గ్లోబల్ టెక్ పరిశ్రమలో ఆర్థిక మందగమనం నెలకొన్న తరుణంలో ఇంటెల్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ఐటీని కుదిపేస్తోన్నాయి. సొంత ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను అభివృద్ధి చేసుకోవడానికి సంస్థ ప్రాధాన్యత ఇస్తోంది.

పౌల్ట్రీకి భారీ ఊరట: బర్డ్ ఫ్లూ మహమ్మారికి కేంద్రం బిగ్ చెక్- ఎల్లుండే..!!
పౌల్ట్రీకి భారీ ఊరట: బర్డ్ ఫ్లూ మహమ్మారికి కేంద్రం బిగ్ చెక్- ఎల్లుండే..!!

ఏఐ విప్లవం టెక్ రంగాన్ని ఏలుతున్న నేపథ్యంలో ఇంటెల్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్ల రూపకల్పనలో వేగం పెంచడంతో పాటు, ఆర్డర్ల తగ్గింపు కారణంగా నష్టపోయిన ఆదాయాన్ని భర్తీ చేయడం ప్రధాన సవాలుగా మారింది. ఇందుకోసం సంస్థ అత్యవసరం కాని విభాగాలు, ప్రాజెక్టులలో కోతలు విధిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.

చిప్ డిజైనింగ్ మరియు తయారీ రంగంలో కోల్పోయిన ఆధిపత్యాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇంటెల్ తీవ్రంగా శ్రమిస్తోంది. గ్లోబల్ సరఫరా వ్యవస్థను బలపరచడం, నూతన పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించడమే సంస్థ తాజా వ్యూహంగా కనిపిస్తోంది. రాబోయే త్రైమాసికాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేందుకు కంపెనీ మరిన్ని కార్యాచరణ మార్పులు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+