ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై ఊహించని ట్విస్ట్, ఇక..!!

ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు. దానం నాగేందర్ పైన న్యాయస్థానం అనర్హత వేటుతో ఇక ఉప ఎన్నిక తప్పదని అందరూ భావించారు. ఇంతలో వరుసగా న్యాయ స్థానాల్లో దాఖలు అవుతున్న పిటీషన్లతో ఈ ఉప ఎన్నిక కొత్త టర్న్ తీసుకుంది. విజయారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పైన హై కోర్టు తీర్పు ఇచ్చే వరకూ నిర్ణయం ఉండదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ సమయం లోనే బీజేపీ సైతం కోర్టును ఆశ్రయించటంతో ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ గా మారుతోంది.

ఖైరతాబాద్ ఉప ఎన్నిక విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానం నాగేందర్ పైన కోర్టు అనర్హత వేటు వేయటంతో ఇక ఉప ఎన్నిక ఖాయమని భావించారు. ఇందు కోసం రాజకీయ పార్టీలు సైతం తమ అభ్యర్ధుల పైన కసరత్తు చేసాయి. ఈ సమయంలోనే అనూహ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్‌ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి పి.విజయారెడ్డి.. ఆయన ఎన్నికను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో దానం గెలుపు వేళ తాను దాఖలు చేసిన పిటీషన్ పైన నిర్ణయం వచ్చే వరకు బై పోల్ నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో, హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు తాము ఎలాంటి ఉపఎన్నిక నిర్వహించలేమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా, ఒకవేళ కోర్టు విచారణలో దానం నాగేందర్‌ ఎన్నిక చెల్లదని తీర్పు వస్తే, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన విజయారెడ్డిని నేరుగా ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉంటుందనే చర్చ రాజకీయంగా ఆసక్తిని పెంచింది.

తిరుమల స్థానికులు ఓట్లు వేసేది ఆ ఎన్నికల్లోనే - పరిధి, ప్రత్యేక గుర్తింపు...!!
తిరుమల స్థానికులు ఓట్లు వేసేది ఆ ఎన్నికల్లోనే - పరిధి, ప్రత్యేక గుర్తింపు...!!
bjp-leader-ramachandra-reddy-files-petition-in-high-court-seeking-khairatabad-by-election-details-h

కోర్టు తీర్పు పై ఉత్కంఠ

అయితే, ఇదే సమయంలో బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి నిర్ణయం కీలకంగా మారుతోంది. విజయా రెడ్డి పిటీషన్ తో ఆయన అలర్ట్ అయ్యారు. తాజాగా తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2023 ఎన్నిక కేవలం ఇద్దరి మధ్య జరిగిన పోరు కాదని, అది బహుముఖ పోటీ అని ఆయన వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ బహుముఖ పోటీలో విజేత ఎన్నిక రద్దయితే, రెండో స్థానంలో ఉన్న వ్యక్తిని నేరుగా గెలిచినట్లు ప్రకటించడం చట్టవిరుద్ధమని తన పిటిషన్‌లో వివరించారు. ఓడిన అభ్యర్థికి నేరుగా పదవి కట్టబెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజల అభిప్రాయాన్ని మళ్లీ కోరేందుకు ఉపఎన్నిక ఒక్కటే మార్గమని తన పిటీషన్ లో పేర్కొన్నారు. దీంతో.. ఇప్పుడు కోర్టు నిర్ణయం ఆధారంగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. ఈ పరిస్థితుల్లో కోర్టు నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+