వైసీపీపై దాడికి టీడీపీకి చంద్రబాబు కొత్త అస్త్రం..! మంత్రులకు క్లియర్..!
ఏపీలో గత కొంతకాలంగా మెగా డీఎస్సీలో (DSC) అక్రమాలు జరిగాయని, వాటిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలంటూ విపక్ష వైసీపీ (YSRCP)భారీఎత్తున ఆందోళనలు చేస్తోంది. వీటిని తొలుత లైట్ తీసుకున్న కూటమి సర్కార్.. ఆ తర్వాత మాత్రం ఆత్మరక్షణలో పడుతోంది. డీఎస్సీలో అక్రమాలు జరగలేదంటూ అధికారులతో రెండు, మూడు సార్లు వివరణలు కూడా ఇప్పించింది. అయినా వైసీపీ దాడి మాత్రం ఆగలేదు. దీంతో డీఎస్సీకి కౌంటర్ గా మరో అంశాన్ని చంద్రబాబు (Chandrababu) తెరపైకి తెస్తున్నారు. అదే గ్రూప్ 1.
వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం (Group 1) వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో ఉంది. వీటిపై అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించడంతో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో కూటమి ప్రభుత్వం గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయించింది. సిట్ ఆ రిపోర్ట్ ను ఇవాళ హైకోర్టుకు సమర్పించింది. ఇందులో మూల్యాంకనం రెండోసారి చేసేందుకు నిబంధనలు అంగీకరించవని తేల్చేసింది. అంటే నిబంధనలకు విరుద్దంగా గ్రూప్ 1 పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం జరిగిందని నిర్దారించింది.

దీంతో కూటమి సర్కార్ కు ఓ అస్త్రం అందివచ్చినట్లయింది. వెంటనే సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగినట్లు సిట్ రిపోర్ట్ ఇవ్వడాన్ని మంత్రులతో ప్రస్తావించారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ఇంత అన్యాయంగా గ్రూప్ 1 పేపర్ల మూల్యాంకనం జరగలేదని వారికి తెలిపారు. దీనిపై సిట్ రిపోర్ట్ ను వెంటనే అధ్యయనం చేయడంతో పాటు వైసీపీని ఎక్కడికక్కడ నిలదీయాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. అలాగే వైసీపీ నిర్వాకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దీంతో పాటు అసెంబ్లీలోనూ చర్చిద్దామని తెలిపారు.
అదే సమయంలో డీఎస్సీపై వైసీపీ శాసనమండలిలో చేసే ఆరోపణలకు దీటుగా సమాధానం చెప్పాలన్నారు.














Click it and Unblock the Notifications