అన్న మళ్లీ కొత్త కాన్సెప్ట్ తో వచ్చాడ్రోయ్.. ట్రైలర్ అదుర్స్..!
యువ హీరో హర్ష్ రోషన్ కోర్ట్ మూవీతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీదేవి- హర్ష రోషన్ మధ్య కెమిస్ట్రీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో హర్ష్ రోషన్ ఇటీవలికాలంలో వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. కోర్ట్ తర్వాత బ్యాండ్ మేళం సినిమా చేశాడు. ఈ మూవీ కూడా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. కోర్ట్ మూవీ జంట ఈ సినిమాలో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు 'తెల్ల కాగితం' సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చాడు హర్ష్ రోషన్. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ చాలా రీఫ్రెషింగ్ గా ఉంది. 2006 లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ మొదట్లోనే తెలిపారు.

ట్రైలర్ లో హర్ష్ రోషన్ ఇన్నోసెంట్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. తెలిసీ తెలియని వయసులో మీరు చేసే ఒక చిన్న తప్పు తెల్ల కాగితం మాదిరిగా ఉన్న మీ జీవితాల్ని నాశనం చేస్తుంది అనే డైలాగ్ ఆకట్టుకుంది. కమింగ్ ఏజ్ రొమాన్స్ డ్రామాతో పాటు ఇంటెన్స్ గా స్టోరీని నడిపిన తీరు అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే హర్ష్ రోషన్ కు కోర్ట్ మూవీ రేంజ్ లో హిట్ గ్యారంటీ అనిపిస్తోంది. ఇక ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే విశేషం ఏంటంటే.. ? ఈ ట్రైలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నూ ఆకట్టుకుంది. దాంతో ఆయన తన ఇన్ స్టా గ్రామ్ స్టేటస్ గా ఈ మూవీ ట్రైలర్ లింక్ ను పెట్టారు. ఈ క్రమంలో చిన్న సినిమాలను ప్రొమోట్ చేయడంలో ప్రభాస్ ఎప్పుడూ ముందుంటారనేది మరోసారి స్పష్టమైంది.
ఇక తెల్ల కాగితం మూవీతో నక్షత్ర అనే కొత్త హీరోయిన్ టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. ఈమె తెలుగు అమ్మాయి కావడం విశేషం. ట్రైలర్ లో హర్ష్ రోషన్- నక్షత్ర మధ్య లవ్ సీన్స్ చాలా ఇన్నోసెంట్ గా రీఫ్రెషింగ్ గా ఉన్నాయి. ఈ చిత్రానికి రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెల్ల కాగితం సినిమాకు రచన నందు సవిరిగాన అందించారు. అలాగే కెమెరామెన్ గా కేవీ గుహన్ వ్యవహరించారు. ఇక సంగీతం విజయ్ బుల్గానిన్ అందించారు. అక్టోబర్ 2 న విడుదల కానున్న ఈ మూవీ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications
