ఏపీలో పరిస్ధితి చేయి దాటిపోతోందా ? కీలక నిర్ణయాల దిశగా చంద్రబాబు..!

ఏపీలో ఈ మధ్య వరుసగా నేరాలు పెరుగుతున్నాయి. అందులోనూ మహిళలపై నేరాల సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా రాజమండ్రిలో తెలంగాణకు చెందిన మెడికో ప్రియాంకపై జరిగిన హత్య.. రాష్ట్రంలో డ్రగ్స్, మద్యం సంస్కృతిపై ప్రశ్నలు లేవనెత్తింది. అలాగే చిలకలూరిపేటకు చెందిన షేక్‌ హసీనా ఘటన, విజయవాడకు చెందిన షేక్‌ ఆసిఫా ఘటనలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితిపై కీలక సమీక్షకు సిద్దమయ్యారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీ సర్కార్ పై ఉద్యోగుల జీతాల భారమెంత ? కాగ్ లెక్క ఇదే..!
ఏపీ సర్కార్ పై ఉద్యోగుల జీతాల భారమెంత ? కాగ్ లెక్క ఇదే..!

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ వ్యవస్థలోని అన్ని శ్రేణుల అధికారులను ఈ సమీక్షలో భాగస్వాముల్ని చేస్తున్నారు. డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు మొత్తం 1,300 మంది అధికారుల్ని ఈ సమీక్షకు పిలిచారు. ఈ సమీక్షలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై నేరాల కట్టడి, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా సైకోలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్టపై సీఎం చర్చిస్తారు.

CM Chandrababu to Hold Law and Order Review Today Amid Rising Crimes Against Women in AP
లోకేష్ కవర్ ఫొటో వ్యాసానికి కోటి రిలీజ్?- తేల్చేసిన ఏపీ సర్కార్..!
లోకేష్ కవర్ ఫొటో వ్యాసానికి కోటి రిలీజ్?- తేల్చేసిన ఏపీ సర్కార్..!

ముఖ్యంగా రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ల పనితీరుపై సీఎం చంద్రబాబు లోతైన విశ్లేషణ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, శాంతిభద్రతల నిర్వహణ వంటి అంశాలపై తన వద్ద ఉన్న రిపోర్టులను ఈ సమావేశంలో నేరుగా అధికారుల ముందే సీఎం బయట పెట్టనున్నారు. రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపాలని, మహిళలు, బలహీన వర్గాల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పోలీస్ ఉన్నతాధికారులు సచివాలయంలో ప్రత్యక్షంగా హాజరు కానున్నారు. అలాగే జిల్లాల్లోని మిగిలిన అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+