మెడికో ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు సీరియస్.. కీలక నిర్ణయం!

రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీ కొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాటి ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సీఎం సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జిల్లా అధికారులతో గతంలోనే ఓసారి జిల్లా అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి... ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో మరోసారి సీఎం చంద్రబాబు మాట్లాడారు.

Medico Priyaka: మృత్యువుతో పోరాడి ఓడిపోయిన మెడికో ప్రియాంక..!
Medico Priyaka: మృత్యువుతో పోరాడి ఓడిపోయిన మెడికో ప్రియాంక..!

ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించగా.... నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రియాంకకు ప్రమాదం జరిగిన అనంతరం రాజమండ్రిలో చికిత్స అందించడం, తరువాత కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన విషయాన్ని అధికారులు వివరించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదే విధంగా బాధిత కుటుంబానికి ఇతరత్రా అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

Rajahmundry Medico Priyanka Dies AP CM Chandrababu Naidu Announces Rs 20 Lakh Ex-Gratia Details

అసలేం జరిగిందంటే?
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రియాంక రాజమండ్రిలో వైద్య విద్యను అభ్యసిస్తోంది. ఆగస్టు 3న స్నేహితుడితో కలిసి సినిమా చూసేందుకు వెళ్లి వస్తున్న సమయంలో ఆమెకూ, మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆంఢ్రూ విలియం అనే ఇద్దరితో వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె స్నేహితుడు నడుపుతున్న బైక్ వెనుక కూర్చొన్న ప్రియాంకను.. వారు కారుతో గుద్దేందుకు పలుమార్లు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం మాల్ బయటకు వెళ్లగానే ఆమె బైక్‌ను వారు గుద్దేయడమే కాకుండా ఆమె తలపై నుంచి కారు పోనిచ్చారు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది.

రాజమండ్రి మెడికో ప్రియాంక కేసులో మరో ట్విస్ట్..! తండ్రి కీలక నిర్ణయం..!
రాజమండ్రి మెడికో ప్రియాంక కేసులో మరో ట్విస్ట్..! తండ్రి కీలక నిర్ణయం..!

ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే తొలుత ఈ కేసును నామమాత్రపు సెక్షన్లలో నమోదు చేసిన పోలీసులు..ఆ తర్వాత విమర్శలు రావడంతో సెక్షన్లు మార్చారు. తాజాగా ఆమె తండ్రి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర సెక్షన్లతో కేసు పెట్టారంటూ మరో ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై స్పందించడం లేదని కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితమే బ్రెయిన్ డెడ్ అయిన ప్రియాంకను బతికించేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినా ఆమె శరీరం స్పందించకపోవడంతో ఇవాళ చనిపోయినట్లు ప్రకటించారు. ప్రియాంక మృతిపై ప్రభుత్వం స్పందించి.. నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+