Jamui Girl Viral Video: అమ్మాయిని వేధించిన నిందితుడు ఎన్ కౌంటర్.. ఏం జరిగిందంటే..??
ఇటీవల బిహార్ లోని జమూయ్ జిల్లాలో పదో తరగతి విద్యార్థినిని కొందరు దుండగులు వేధించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 శనివారం రాత్రి కోచింగ్ నుంచి తిరిగి వస్తున్న పదోతరగతి అబ్బాయి, అమ్మాయిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. జమూయ్ జిల్లాలోని జమూయ్- లఖిసరాయ్ రోడ్డు వెంబడి ఈ దారుణమైన ఘటన జరిగింది. స్టూడెంట్స్ వస్తున్న స్కూటీని ఆపి వారిపై ఇష్టానుసారంగా వ్యవహరించారు. మైనర్ బాలికను ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తూ వేధించారు. ప్లీజ్ మిమ్మల్ని వదిలేయండి.. అని ఆ బాలిక బ్రతిమాలినా కనికరం చూపించకుండా వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ రాక్షసానందం పొందారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వీడియో ఆధారంగా మైనర్ బాలికను వేధించిన కేసులో ఇప్పటివరకూ ఐదుగురిని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో ప్రధాన నిందితుడు నందన్ యాదవ్.. పోలీసుల ఎన్ కౌంటర్ లో గాయపడినట్లు సమాచారం. నందన్ యాదవ్ ను పట్టుకునే క్రమంలో అతడు పోలీసులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రతిగా పోలీసులు నందన్ యాదవ్ పై కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో నిందితుడికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఇక చికిత్స కోసం నందన్ యాదవ్ ను ఆసుపత్రిలో చేర్చారని పోలీసులు వెల్లడించారు. అంతకుముందే నందన్ యాదవ్ ను అరెస్ట్ చేసినా.. సీన్ రీ క్రియేషన్ కోసం అతడ్ని సంఘటనాస్థలికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో అతడు పోలీసుల వద్ద ఉన్న తుపాకీ తీసుకుని వారిపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. దాంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా అతడిపై కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఈ ఎన్ కౌంటర్ లో నందన్ యాదవ్ చనిపోయినట్లు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం అతడు తీవ్రంగా గాయపడ్డాడని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ కేసులో ఇప్పటివరకూ ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు మైనర్ బాలురు ఉండటం గమనార్హం. మొత్తం ఈ ఘటనకు పాల్పడినవారు ఏడుగురని పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ చౌదరీ మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారని తప్పకుండా వారికి కఠిన శిక్ష పడుతుందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications
