C-PAC Survey: వైసీపీదే గెలుపు కానీ..! మున్సిపల్ సర్వేపై సీ-ప్యాక్ యూటర్న్..!
ఏపీలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. నాలుగు నగర పాలక సంస్థలతో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ నెల 26న పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎవరు గెలుస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. గతంలో తొలి దశ మున్సిపల్ పోరులో 100 చోట్ల ఎన్నికలు జరిగినా లేని ఉత్కంఠ ఈసారి రెండో దశలో 23 స్ధానాలపై కనిపిస్తోంది. దీంతో సీ-ప్యాక్ సంస్థ ఈ ఉత్కంఠకు తెర దించేలా రెండో దశ మున్సిపల్ ఎన్నికలపై సర్వే రిపోర్టులు (C-PAC Survey) ఇస్తోంది.
వీటిలో తాజాగా ఎన్నికలు జరిగే నాలుగు మున్సిపల్ కార్పోరేషన్లపై తమ సర్వే అంచనాలను వెల్లడించింది. ఇందులో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి మేయర్ స్ధానలతో పాటు డివిజన్లు కూడా ఉన్నాయి. వీటిలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రిలో మేయర్ సీట్లను వైసీపీ గెల్చుకోబోతోందని సీ ప్యాక్ సర్వే తెలిపింది. అలాగే మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్లో మేయర్ సీటును మాత్రం టీడీపీ కైవసం చేసుకుంటుందని తెలిపింది. అయితే శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్లలో అత్యధిక డివిజన్లను కూటమి కైవసం చేసుకుంటుందని, కాకినాడలో మాత్రం మేయర్ తో పాటు డివిజన్లలోనూ వైసీపీ ఆధిక్యం కొనసాగుతుందని వెల్లడించింది.

ఈ సర్వేపై విమర్శలు వచ్చాయో, మరే ఇతర కారణమూ తెలియదు కానీ సీ-ప్యాక్ సంస్ద యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఎక్స్ లో ఓ వివరణతో కూడిన ట్వీట్ ను పోస్ట్ చేసింది. ఇందులో తాము నాలుగు కార్పోరేషన్ ఎన్నికలపై నిన్న ఇచ్చిన సర్వే ఫలితాలు సజావుగా ఎన్నికలు జరిగితే 100 శాతం నిజమవుతాయంటూ ఓ ఝలక్ ఇచ్చింది. ఉన్న వాస్తవం ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమని, ఇందులో ఎటువంటి సందేహం లేదని తెలిపింది. అంటే అధికార కూటమి తమ బలంతో ఈ ఎన్నికల్ని నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నట్లు పరోక్షంగా వెల్లడించింది. అందుకే తమ సర్వే నిజం కావాలంటే ఎన్నికలు సజావుగా జరగాలంటూ ముందస్తు షరతు పెట్టింది. మరిన్ని వివరాలు మాత్రం ఈ నెల 26న పోలింగ్ తర్వాత తెలియజేస్తామంటూ చివర్లో ప్రకటించింది.













Click it and Unblock the Notifications
