Snakes: పాములే కానీ పాకవు.. గాల్లో పల్టీలు కొడుతూ పరుగులు! సైంటిస్టులకే షాక్!
Snakes: సాధారణంగా పాములు నేలపై మెలికలు తిరుగుతూ పాకుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆగ్నేయాసియాలో కనిపించే కొన్ని బుల్లి పాములు ప్రమాదం ఎదురైనప్పుడు జిమ్నాస్టిక్స్ క్రీడాకారుల్లా గాల్లో పల్టీలు కొడుతూ వేగంగా తప్పించుకుంటాయంటే నమ్ముతారా? అవును.. "డ్వార్ఫ్ రీడ్ స్నేక్స్" జాతికి చెందిన ఈ వింత పాముల విన్యాసాలను సైంటిస్టులు తొలిసారిగా హై-స్పీడ్ కెమెరాల్లో స్పష్టంగా బంధించారు. 'కరెంట్ బయాలజీ' జర్నల్‌లో ఈ ఆసక్తికర రీసెర్చ్ వివరాలు ప్రచురితమయ్యాయి.
పాములు పల్టీలు ఎలా కొడతాయంటే?
కాళ్లు, చేతులు లేని ఓ పొడవాటి జీవి గుండ్రంగా చక్రంలా తిరుగుతూ ముందుకు కదలడం సైంటిస్టులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జపాన్ లోని తోహో విశ్వవిద్యాలయ పర్యావరణ శాస్త్రవేత్త యోసుకే కోజిమా బృందం మలేషియాలోని కుబా నేషనల్ పార్క్ నుంచి సేకరించిన సూడోరాబ్డియన్ జాతి పాములపై ప్రయోగాలు నిర్వహించింది. ఈ ప్రయోగం ప్రకారం..ప్రమాదం పొంచి ఉందని గ్రహించగానే ఈ పాము ముందుగా తన శరీరాన్ని ఇంగ్లీష్ అక్షరం 'C' ఆకారంలోకి వంచుతుంది. తలను నేలపై నుంచి పైకి ఎత్తి, వెళ్లాల్సిన దిశవైపు ఉంచుతుంది. ఆ వెంటనే తన తోకను వేగంగా వెనుకకు విసిరి, ఒక్క ఉదుటన గాల్లోకి ఎగురుతుంది.తల మీదుగా తోకను ముందుకు విసిరి నేలపైకి దించుతుంది. తోక నేలను తాకగానే మరో పల్టీకి సిద్ధమవుతుంది. ఇలా వరుస పల్టీలు కొడుతూ గంటకు సుమారు 6 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

11 నుంచి 28 సెంటీమీటర్ల పొడవు మాత్రమే!
మలేషియా అడవుల్లో ఆకుల కింద దాక్కునే ఈ పాములు కేవలం 11 నుంచి 28 సెంటిమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి. ప్రయోగశాలలో 2.2 మీటర్ల ట్రాక్‌పై వీటిని వదిలి, మెల్లగా తాకగానే ఇవి చక్రంలా తిరుగుతూ పరుగులు తీశాయి. ఈ విన్యాసం చేసేటప్పుడు కూడా ఎగిరే పాముల తరహాలోనే ఇవి తమ తలను ఏ మాత్రం కదలకుండా స్థిరంగా ఉంచుకోవడం విశేషం.
పాత కథలకు శాస్త్రీయ ఆధారం?
"కాళ్లు, చేతులు లేని పాము ఇంత వేగంగా, కండరాలు, ఎముకలను ఉపయోగించి పల్టీలు కొట్టడం నిజంగా అద్భుతం. వీటి మెదడు పనితీరు, శరీర నిర్మాణం ఇతర పాముల కంటే భిన్నంగా ఉందా అనేది పరిశోధించాలి" అని బ్రౌన్ యూనివర్సటీ జీవశాస్త్రవేత్త జెస్సికా టింగిల్ అభిప్రాయపడ్డారు. 1800వ దశకంలో కొందరు రచయితలు చక్రంలా దొర్లుకుంటూ వెళ్లే 'హూప్ స్నేక్స్' గురించి రాసిన కథలు అప్పట్లో కేవలం కల్పితాలని భావించేవారని, కానీ ఇప్పుడు ఈ వీడియోలతో అవి నిజమేనని తేలిందని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
高速で転がって逃げるヘビの驚きの逃避行動について、共同筆頭著者として参加した論文が出ました!常識ではありえない動きをしていて、めっちゃ面白いので、ぜひ動画だけでも見てください!https://t.co/os2Z6BtzPg https://t.co/XGDwGmrPvW
— にょろにょろぴょんぴょん (@ular_katakkatak) October 20, 2026














Click it and Unblock the Notifications
