తప్పు చేశా: దాసరి నిర్వేదం
హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత, కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు వేదాంత ధోరణిలో పడ్డారు. యువకళావాహిని ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ కు ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డును ప్రదానం చేసిన సభలో ఆయన రాజకీయాల పట్ల నిర్వేదం వ్యక్తం చేశారు. రాజకీయాలకు వచ్చి తాను తప్పు చేశానని ఆయన ఆదివారం ఆ కార్యక్రమంలో అన్నారు. నాలుగేళ్ల పాటు తాను సినిమా రంగాన్ని వదిలేశానని, మళ్లీ సినిమాలకు రావాలని ఉందని ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చినందుకు తాను బాధపడుతున్నానని ఆయన అన్నారు.
పదవులు శాశ్వతం కాదని, పదవులు వస్తాయి, పోతాయని, దర్శకులూ నటులూ మాజీలు కారని ఆయన అన్నారు. స్టార్ట్, కట్ చెప్పక నాలుగేళ్లవుతోందని, ఒక రోజు ఐదు షూటింగులు చేసేవాడినని, ఆ రోజు మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు. ఈ విషయాన్ని భగవంతడి సాక్షిగా, తన కన్నబిడ్డల సాక్షిగా చెబుతున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications