కాస్తా మందగించిన బాబు యాత్ర

మొదట నిర్ణయించుకున్న ప్రకారం చంద్రబాబు యాత్ర ఈ నెల 30వ తేదీన గుంటూరు జిల్లాలో ముగిసి నల్లగొండ జిల్లాలో ప్రవేశించాల్సి ఉంది. అయితే ఆయన యాత్ర గుంటూరు జిల్లాలో మే 2వ తేదీన ముగుస్తుంది. మే 1వ తేదీన గుంటూరు జిల్లాలోని 1వ తేదీన పిడుగురాళ్లలో పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. అభ్యర్థుల జాబితాను చంద్రబాబు నల్లగొండ జిల్లాలో ప్రకటిస్తారు. ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా యాత్ర సందర్భంగా ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రబాబుకు సీనియర్ నాయకులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications