శవమై తేలిన డాక్టర్ సాంబశివరావు
హైదరాబాద్: మూడు రోజుల క్రితం నర్సాపూర్ ఎక్సుప్రెస్సులో ప్రయాణిస్తూ మాయమైన డాక్టర్ సాంబశివరావు మృతదేహం కనిపించింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల - నడికుడి రైల్వే ట్రాకుకు సమీపంలోని దాచేపల్లి వద్ద అతని మృతదేహం కనిపించింది. ఒక బొందలో అతని మృతదేహం బోర్లా పడి ఉంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు తెలియజేశారు. ఆ శవాన్ని సాంబశివరావుదిగా గుర్తు పట్టారు.
గుంటూరుకు చెందిన డాక్టర్ సాంబశివరావు హైదరాబాదులోని మల్కాజిగిరి రైల్వే ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఆయన గతంలో చర్లపల్లి జైలులో డాక్టరుగా పనిచేశారు. ఆ సమయంలో అతనికి మద్దెలచెర్వు సూరి, మొద్దు శీనులతో పరిచయం ఏర్పడినట్లు చెబుతున్నారు. అయితే సాంబశివరావుతో పాటు ప్రయాణం చేసిన ఆయన మిత్రుడు సునీల్ కుమార్ పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ కుమారే ఈ హత్యకు కారణమని వారంటున్నారు.












Click it and Unblock the Notifications