పార్టీ ఆఫీసులో చిరు పతాకావిష్కరణ

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి జూబిలీహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జాతీయ పతాకను ఆవిష్కరించారు. వికలాంగుల మధ్య ఆయన ఈ పతాకను ఆవిష్కరించారు. చిరంజీవి ఈ నెల 17వ తేదీన తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటిస్తారని ఆయన బావమరిది అల్లు అరవింద్ గురువారం సాయంత్రం ప్రకటించారు. చిరంజీవి పాటల క్యాసెట్ ను సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో అవిష్కరించి ఆయన ప్రసంగించారు. ఈ నెల 26వ తేదీన పార్టీని తిరుపతిలో జరిగే బహిరంగ సభలో లాంఛనంగా ప్రకటిస్తారని ఆయన చెప్పారు.

తిరుపతిలో అవిలాల మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సభకు 20 లక్షల మంది దాకా వస్తారని అల్లు అరవింద్ చెప్పారు. చిరంజీవి ఆంతరంగిక భద్రతను ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ చూస్తారు. యువ విభాగాన్ని కూడా పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+