గౌరు వెంకటరెడ్డి సహా ఖైదీల విడుదల
హైదరాబాద్: హైదరాబాద్ లోని చర్లపల్లి జైలు నుంచి కాంగ్రెస్ నాయకుడు, శాసనసభ్యురాలు గౌరు చరితా రెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డితో సహా 43 మంది ఖైదీలు శుక్రవారం విడుదలయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ జైళ్లలో ఉన్న 317 మందికి గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఇందులో భాగంగానే చర్లపల్లి జైలు నుంచి గౌరు వెంకటరెడ్డి విడుదలయ్యారు. గతంలో గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించడంపై వివాదం చెలరేగి కోర్టు దాకా వెళ్లింది. దీంతో అప్పుడు ఆయన విడుదల కాలేకపోయారు.
చర్లపల్లి జైలు నుంచి విడుదలైనవారిలో ఎక్కువ మంది జీవిత ఖైదీలే ఉన్నారు. తాను జైలు నుంచి విడుదల కావడం సంతోషంగా ఉందని గౌరు వెంకటరెడ్డి ఉన్నారు. తాను ప్రస్తుతానికి భార్యాపిల్లలతో గడుపుతానని ఆయన చెప్పారు. ఇప్పుడు విడుదల కాకపోయినా మరో ఆరు నెలల్లో తాను విడుదలై ఉండేవాడినని ఆయన అన్నారు. జైలు నుంచి విడుదలవుతున్న తమవారి కోసం బంధువులు పెద్ద యెత్తున రాష్ట్రంలోని వివిధ జైళ్ల వద్దకు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications