జాతీయ జెండాను ఎగరేసిన లోకేష్

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ ఎన్టీఆర్ మోడల్ స్కూలులో శుక్రవారం జాతీయ పతాకను ఆవిష్కరించారు. గండిపేటలోని ఈ పాఠశాల ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతుంది. సాధారాణంగా ఏటా చంద్రబాబునాయుడు ఈ పాఠశాలలో జాతీయ పతాకను ఆవిష్కరిస్తారు. మీ కోసం యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అనంతపురంలో ఉన్నారు. మీ కోసం యాత్ర సందర్భంగా శుక్రవారం అనంతపురంలో బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో చంద్రబాబు పాల్గొంటారు.

దీంతో లోకేష్ రాజకీయాల్లోకి అడుగు పెడతారనే ప్రచారం మొదలైంది. లోకేష్ కు ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో జాతీయ పతాక ఆవిష్కరణ బాధ్యతను అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. స్కూల్ సేవా కార్యక్రమాలకు సంబంధించింది కాబట్టి లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఉపాధ్యక్షుడు పుష్పరాజ్ పతాకావిష్కరణ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+