హైదరాబద్ తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కృష్ణ మహేష్ అభిమానుల సంఘం అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. మహేష్ జన్మదిన వారోత్సవాలను చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాహిత కార్యక్రమాల ద్వారానే అటువంటి వారికి బుద్ధి చెప్తామని ఆయన అన్నారు. విశాఖ నన్ పోలిసు స్టేషన్ పరిధిలో చిరంజీవి మహేష్ అభిమానులకు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో బుజ్జి అనే మహేష్ అభిమాని గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు.