సీతారాంతో టిడిపి నేతల మంతనాలు
శ్రీకాకుళం: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వైపు చూస్తున్న మాజీ మంత్రి తమ్మినేని సీతారాంను బుజ్జగించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. సీతారాంతో పార్టీ సీనియర్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. పార్టీని వీడిపోవద్దని వారు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీతారాం గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదు.
ఇటీవల ఆయన 60 ప్రశ్నలు వేస్తూ ఒక లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడికి ఒక లేఖ రాశారు. ఎర్రంనాయుడిపై ఆయన ఆ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాలో పార్టీలో ఎవరినీ ఎదగనీయడం లేదని ఆయన ఎర్రంనాయుడిపై విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications