స్కూల్లో విద్యార్థి అనుమానస్పద మృతి
నిజామాబాద్: నిజామాబాదులోని న్యూ ప్రియదర్శిని ఉన్నత పాఠశాలలో మహేష్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను ఆ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడా, ఇతర కారణాలేమైనా అతని మృతి వెనక ఉన్నాయా అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే పాఠశాలలో చదువుతున్న అతని సోదరి తీవ్ర భయాందోళనలకు గురైంది. శవాన్ని పెట్రోల్ పోసి కాల్చడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెడ వద్ద గాటు పడి ఉండడం కూడా అనుమానాలకు తావు ఇస్తోంది.
విద్యార్థి మృతిని నిరసిస్తూ వివిధ విద్యార్థి సంఘాల కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాలపై దాడి చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పాఠశాల యజమానులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications