కాంగ్రెసుకు శైలజారెడ్డి రాజీనామా
హైదరాబాద్: నెల్లూరు నగర పాలక సంస్థ మేయరు కె. శైలజారెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు పంపినట్లు ఆమె తెలిపారు. శాసనసభ్యులు ఆనం సోదరుల వేధింపులు భరించలేకనే తాను కాంగ్రెసుకు రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. తాను ప్రజారాజ్యంలో చేరుతానని ఆమె చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డితో ఆమెకు చాలా కాలంగా విభేదాలున్నాయి. ఆమెను మేయరు పదవినుంచి తప్పించే ప్రయత్నాలు కూడా సాగాయి. తనను మేయరు పదవినుంచి తప్పించడంపై ఆమె హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం విచారణ సాగుతోంది.












Click it and Unblock the Notifications