గణేష్ ఉత్సవాల్లో 4గురు మృతి
హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకాల గ్రామంలో గణేష నిమజ్జనోత్సవం సందర్భంగా నలుగురు యువకులు మృతి చెందారు. విద్యుత్ షాక్ తగిలి వారు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నరేష్, మధు, శ్రీనివాస్, నరేష్ అనే నలుగురు యువకులు మరణించారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications