లోయలో పడ్డ బస్సు: 12 మంది మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. శ్రీ వెంకటేశ్వర ట్రావెల్స్ బస్సులో పెంచలకోనకు వెళ్లి వస్తున్న బస్సు లోయలో పడింది. ఆ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 30 మంది చిట్వెల్ ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు - కడప జిల్లా సరిహద్దులోని చిట్వేలి - రాపూర్ ఘాట్ రోడ్డులో బస్సు చెట్టును ఢీకొని 30 అడుగుల లోతు లోయల పడింది.
ప్రయాణికులంతా కడప జిల్లాలోని రైల్వే కోడూరుకు చెందినవారు. పెంచలకోనలో ఒక పాప పుట్టు వెంట్రుకలు తీయించుకుని వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒక పాప మరణించింది. బస్సు క్లీనర్ గాయాలతో బస్సు లోపలే కొట్టుమిట్టాడుతున్నారు. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రాణనష్టం తక్కువగా ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బస్సును కోసి సహాయక బృందాలు ప్రయాణికులను వెలికి తీశారు. శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 12మృత దేహాలను వెలికి తీశారు. ప్రయాణికులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విశేషం. బస్సును నడుపుతున్న సమయంలో డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే.












Click it and Unblock the Notifications