చికాగోలో తెలుగు యువతి హత్య
హైదరాబాద్: అమెరికాలోని చికాగోలో తెలుగు యువతి సౌమ్య దారుణ హత్యకు గురైంది. నల్లజాతీయులు ఈ హత్యకు ఒడిగట్టినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం మున్యాల గ్రామానికి చెందిన సౌమ్య అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది.
సౌమ్య ఆదివారం ఉదయం పది గంటలకు హత్యకు గురైనట్లు ఇక్కడికి సమాచారం అందింది. మున్యాలకు చెందిన భూపతిరెడ్డికి చెందిన ఇద్దరు కూతుళ్లు కూడా ఆమెరికాలో ఉంటున్నారు. హత్యకు గురైన సౌమ్య ఆయన చిన్న కూతురు. కొద్ది రోజుల క్రితం భూపతిరెడ్డి మరణించారు. దీంతో ఆయన కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది.












Click it and Unblock the Notifications