సచివాలయం ముట్టడి: అరెస్టులు
హైదరాబాద్: తెలంగాణ విమోచన దిన్సోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని సచివాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన ఎబివిపి కార్యకర్తలను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, బిజెపి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం నవాబు యూనియన్ ప్రభుత్వానికి లొంగిపోవడంతో హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది. ఈ సందర్భాన్ని తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో ప్రత్యేక తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన ఎబివిపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎబివిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.
తెలంగాణ జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల వద్ద బిజెపి కార్యకర్తలు జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. తెలంగాణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో 144వ సెక్షన్ విధించారు. పరేడ్ గ్రౌండ్స్ లోకి బిజెపి కార్యకర్తలు వెళ్లకుండా పోలీసులు మోహరించారు. కరీంనగర్ లో బిజెపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అరెస్టు చేశారు. మెదక్ జిల్లాలో కూడా బిజెపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications