మమ్మల్ని ఆశీర్వదించండి: వైయస్

ఇచ్చిన మాట తప్పని తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. నిజాంసాగర్ ను పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. నిజాంసాగర్ కు ఆధునిక కళ తెస్తామని ఆయన చెప్పారు. మూడేళ్లలో ఆధునీకరణ పనులు పూర్తవుతాయని ఆయన చెప్పారు. ఈ బహిరంగ సభలో శాసనసభా స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ ఆధునీకరణ పనులను 549 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నారు. ఈ పథకం పూర్తయితే 356 గ్రామాలకు చెందిన దాదాపు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.












Click it and Unblock the Notifications