పేదల పొట్టలు కొడుతున్నారు: చిరు

ప్రశ్నించేవారు లేకపోవడంతో సెజ్ లకు వేలాది ఎకరాలు దారాదత్తం చేస్తున్నారని, 2003 నుంచి సెజ్ ల వ్యవహారం మొదలైతే ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆయన అన్నారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన స్పష్టత లేకుండానే భూములు అప్పగిస్తున్నారని ఆయన విమర్శించారు. పేదలను తమ పొలాల్లోనే తమను కూలీలుగా మార్చడం అభివృద్ధి కాదని ఆయన అన్నారు. భూమి పెద్దలకు హోదా, పేదలకు తిండి పెట్టే తల్లి, సెంటిమెంటు అని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయలేని అమాయకుల నిస్సహాయత వల్లనే ఈ దారుణం జరుగుతోందని, దీన్ని ఆపాలని, ఇందుకు సంబంధించిన మార్పు తప్పకుండా వస్తుందని ఆయన అన్నారు. పెద్దల భూములు సెజ్ ల్లో ఒక్కరివి కూడా పోలేదని, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల భూములే పోతున్నాయని ఆయన అన్నారు. తీరప్రాంతాన్ని సెజ్ ల పేరిట పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడం దారుణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications