సమ్మె విరమణ: విధుల్లో వైద్యులు
హైదరాబాద్: ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెను ప్రభుత్వ డాక్టర్లు విరమించుకున్నారు. ప్రభుత్వ వైద్యులకు, ప్రభుత్వానికి మధ్య సోమవారం రాత్రి చర్చలు ఫలించాయి. దీంతో మంగళవారం నాడు డాక్టర్లు విధులకు హాజరయ్యారు.
సోమవారం సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి చెందిన అన్ని ఆస్పత్రులో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అందకు ఐదుగురు రోగులు మరణించారు. తమ డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మెను విరమించినట్లు వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications