చింతపల్లి ప్రజాభిప్రాయ సేకరణ బహిష్కరణ
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా చింతపల్లి బాక్సైట్ తవ్వకాలపై అధికారుల ప్రజాభిప్రాయ సేకరణను రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు శుక్రవారం బహిష్కరించాయి. గిరిజనులు కూడా ఈ ప్రజాభిప్రాయాన్ని బహిష్కరించారు. బూటకపు ప్రజాభిప్రాయాన్ని నిలిపేయాలని డిమాండ్ చేస్తూ వారు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణపై సుప్రింకోర్టుకు వెళ్తామని కూడా ప్రజాసంఘాల నాయకులు చెప్పారు.
ఎవరూ లేకపోయినా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులు తమ ప్రసంగాలను కొనసాగించారు. ఖాళీ కుర్చీలను ఉద్దేశించి వారు ప్రసంగించారు. పర్యావరణ, తదితర నివేదికలను వారు చదివి వినిపిస్తూ పోయారు. ప్రజాభిప్రాయ సేకరణ తంతును ఏదో రూపంలో పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి వారు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications