తెలంగాణలోనూ చిరుకు ఆదరణ: మూర్తి
హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీ అధినేత చిరంజీవికి ఆదరణ లేదనడం సరి కాదని ప్రజారాజ్యం సలహాదారు కె.ఎస్.ఆర్. మూర్తి అన్నారు. తెలుగుదేశ, కాంగ్రెసులకు ధీటుగా ఆయన శుక్రవారం ప్రజలకు హామీల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి వస్తే పేదల ఇళ్లకు లక్ష రూపాయలేసి ఇస్తామని, రాష్ట్ర బడ్జెట్టును లక్ష కోట్ల నుంచి లక్షా 50 వేల కోట్ల రూపాయలకు పెంచుతామని ఆయన చెప్పారు. ఇందిరమ్మ గృహాలకు తనకు ఎక్కడా కనిపించడం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం పేదల ఇళ్లకు ఇస్తున్న 45 వేల రూపాయలను లక్ష రూపాయలకు పెంచుతామని ఆయన చెప్పారు.
సిరిసిల్ల చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు. చేనేత కార్మికులకు అరకొర సహాయం అందిస్తున్నారని ఆయన విమర్శించారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల నష్టపరిహారు సరిపోదని ఆయన అన్నారు. పది లక్షల రూపాయల ఇస్తే ఆ సొమ్మును బ్యాంకులో వేసుకుని వడ్డీపై వారు జీవిస్తారని ఆయన చెప్పారు. మృతుల పిల్లలకు ఆశ్రమ పాఠశాలలో చదువు చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీడి పరిశ్రమ దెబ్బ తినడంతో మహిళలు బీడీలు చేసే పనిని కూడా కోల్పోయారని, దీంతో సిరిసిల్లలో పరిస్థితి మరింత విషమించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications