నారాయణ చికెన్ దీక్ష విరమణ
హైదరాబాద్: ఏడాది తర్వాత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తన చికెన్ దీక్షను విరమించారు. 365 రోజుల తర్వాత ఆయన శుక్రవారంనాడు ఆయన చికెన్ రుచి చూశారు. నిరుడు ప్రకాశం జిల్లా చిన గంజాంలో మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన ఆయన చికెన్ తిన్నారు. ఆయన చికెన్ తింటున్న ఫొటోలు పత్రికల్లో అచ్చయ్యాయి. మహాత్మా గాంధీ జయంతి రోజున నారాయణ చికెన్ తినడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఏడాది పాటు చికెన్ తినబోనని ఆయన చెప్పి స్వయంగా శిక్ష విధించుకున్నారు.
శిక్షా కాలం ముగియడంతో ఆయన శుక్రవారం చికెన్ రుచి చూశారు. ఆయన తన నివాసంలో విందు ఏర్పాటు చేసి చికెన్ వండించి పది మందికి పెట్టి తాను తిన్నారు. చిత్తూరు జిల్లా నుంచి ఆయన సోదరుడు కూడా వచ్చారు. ఆయన చికెన్ తింటున్న దృశ్యాలు శుక్రవారంనాడు మీడియాకు ప్రధాన ఆకర్షణ అయ్యాయి.












Click it and Unblock the Notifications