బెల్టు షాపులపై వైయస్ కొరడా

అయితే బెల్టు షాపుల తొలగింపునకు ముఖ్యమంత్రి ఆదేశాలివ్వడానికి మరో కారణాన్ని చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికులు కల్తీ మద్యం సేవించడం వల్లనే మరణించినట్లు ముఖ్యమంత్రికి నివేదిక అందింది. చేనేత జౌళి శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో ఈ కమిటీని వేశారు. సిరిసిల్ల చేనేత కార్మికుల మరణం ముఖ్యమంత్రిని తీవ్రంగా కలత పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన బెల్టు షాపులపై కొరడా ఝళిపించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కాగా, కల్లుగీత కార్మికుల 8.5 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications