నిశ్శబ్ద విప్లవం వస్తోంది: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. సునామీలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గుంటూరు యువగర్జన సదస్సుకు అనూహ్య స్పందన లభించిందని, ప్రజలు సదస్సుకు స్వచ్ఛందంగా తరలివచ్చారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ వారు డబ్బులు దండుకుంటున్నారని ఆయన అన్నారు. తమకు లొంగనివారిని వివిధ పద్ధతుల్లో వేధిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. తన ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆయన అన్నారు.

రాష్ట్ర రాజకీయ వ్యవస్థను కాంగ్రెస్ వారు ఛిన్నాభిన్నం చేశారని, ప్రతిపక్షాల నాయకులను వివిధ రకాలుగా వేధిస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తన పట్ల వెకిలి చేష్టలకు పాల్పపడ్డారని ఆయన అన్నారు. అన్ని పార్టీల నాయకులను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అవమానించారని, ఇటువంటి ముఖ్యమంత్రిని తాను చూడలేదని ఆయన అన్నారు. యువగర్జన దేశంలో ఎక్కడా జరగనట్లు జరిగిందని, ఇంత పెద్ద యెత్తున ప్రజలతో ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+