బాలయ్య సభపై చిరు పార్టీ గుర్రు

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ పాల్గొన్న యువగర్జన సదస్సుపై చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ నాయకులు పెద్ద యెత్తున విమర్శలకు దిగారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తమ విమర్శలను వినిపించారు. యువగర్జన కుల, కుటుంబ గర్జనగా సాగిందని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కత్తి పద్మారావు వ్యాఖ్యానించారు. వేదికపై అంబేడ్కర్ చిత్రపటం లేకపోవడం దళితులను అవమానించడమేనని ఆయన విలేకరులతో అన్నారు. బిసీలను యువగర్జనలో అవమానించారని, తెలుగుదేశం నేతలు యనమల రామకృష్ణుడు, కె. ఎర్రంనాయుడులను వేదిక వెనక వైపునకు నెట్టడమే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు.

గుంటూరు తెలుగుదేశం పార్టీ యువగర్జనకు ప్రజలను తీసుకుని వచ్చారని, తమ ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి తిరుపతి సభకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారని తమ్మినేని సీతారాం అన్నారు. ఇదే మాటను వంగా గీత కూడా అన్నారు. 26 ఏళ్ల తెలుగుదేశం పార్టీ యువగర్జన సదస్సుకు ప్రజలను సమీకరించిందని, నాయకులు సభకు ప్రజలను తరలించారని ఆమె అన్నారు. చిరంజీవి తిరుపతి సభకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+