ఏది 'సత్యం'? ఏది అసత్యం?-తొలగింపులు
చెన్నై: అంతర్గత ఆడిట్ లో అవకతవకలు బయట పడ్డాయన్న కారణంతో సత్యం కంప్యూటర్స్ సంస్ధ 30 మంది ఉద్యోగులను తొలగించింది. హైదరాబాద్ నుంచి చెన్నైకి బదిలీ చేసిన సమయంలో ట్రావెల్ అలవెన్సుకు క్లెయిన్ చేసుకోవడంలో ఆ ఉద్యోగులు తప్పుడు బిల్లులు సమర్పించారని సత్యం హెచ్ ఆర్ విభాగం అభియోగం.
ఎప్పుడో ఏడాదిన్నర క్రితం సమర్పించిన బిల్లులను పట్టుకుని ఇప్పుడు వాటిని నిగ్గదీయడం అన్యాయమని సత్యం ప్రాజెక్ట్ అసోసియేట్స్ అంటున్నారు. తాము సమర్పించిన బిల్లులు నిఖార్సనవని వారు తెలిపారు. ఈ విషయం చెప్పినా వారు విన్పించుకోవడం లేదని వారి వాదన.
ఈ ఆరోపణల మీద వీరి జీతాలను కంపెనీ నిలిపివేసింది. ఏదో వంకతో సత్యం కంపెనీ తమను ఉద్యోగాల నుంచి తీసివేయదలచుకుందని వారు ఆరోపించారు. దేశ వ్యాప్తంగా నాలుగు వందల మందిని తీసివేయడానికి సత్యం కంపెనీ ఇటువంటి కారణాలను వెదికి పెట్టుకుందని ఈ ఉద్యోగుల ఆరోపణ.












Click it and Unblock the Notifications