న్యూఢిల్లీ: లోకసభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ అస్వస్థకు గురయ్యారు. దాంతో ఆయనను ఆర్మీ రీసెర్చ్ అండు రెఫరల్ ఆస్పత్రిలో చేర్చారు. ఛాతీకి సంబంధించిన అస్వస్థతతో ఆయన బాధపడుతున్నారు. 79 ఏళ్ల సోమనాథ్ ఛటర్జీని బుధవారం ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కొద్ది రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు.