కాకినాడ రేవులో 4వ ప్రమాద హెచ్చరిక
కాకినాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెనుతుపానుగా మారడంతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఓడరేవులో నాల్గవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీని ప్రభావంవల్ల వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల ఈదురు గాలులతో కూడుకున్న వర్షాలు కురవవచ్చని, 36 గంటల్లో కోస్తాంధ్రాలో పలుచోట్ల భారీ వర్షాలు కురియవచ్చునని వాతావరణ నిపుణలు పేర్కొన్నారు.
దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంట కోతకు సిద్ధమైందని ఈ వర్షాలవల్ల పంటలు నాశనమౌతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు జాగ్రత్తగా సముద్రతీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళమని అధికారులు ఆదేశాలు జారీచేశారు. మత్స్యకారులు కూడా సముద్ర వేటకు వెళ్ళకుండా బోటులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కాకినాడ-ఉప్పాడ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కోతకు గురవుతున్న బీచ్ రోడ్లు, దీంతో పోలీస్ అధికారులు ట్రాఫిక్‌ను పిఠాపురం మీదుగా మళ్లించారు. గత రాత్రి నుంచి వీస్తున్న ఈదురు గాలులకు 10 పూరి గుడిసెలు నేలమట్టమయ్యాయి. అన్ని పోర్టులలోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications