'చిరు' గూటికి చేరిన శివశంకర్
కేంద్ర మాజీ మంత్రి పి శివశంకర్ నేడు చిరంజీవి సమక్షంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఎన్నో దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న శివశంకర్ కొన్నేళ్ళ క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసి తటస్ధంగా ఉన్నారు. న్యాయశాస్త్ర నిపుణుడైన శివశంకర్ ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి ఎంతో సన్నిహితుడు.
శివశంకర్ వంటి సీనియర్ రాజకీయ నాయకులు తమ పార్టీలో చేరడం ఆనందం ఉందని, ఆయన సేవలను తగిన విధంగా ఉపయోగించుకుంటామని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చెప్పారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నైతిక విలువలు లేవని ఈ సందర్భంగా శివశంకర్ విమర్శించారు.












Click it and Unblock the Notifications