అది వలస రాజ్యం: సుధాకర్ రెడ్డి
హైదరాబాద్: ఏరివేసిన కలుపు మొక్కలతో, వలస పక్షులతో నిండిన ప్రజారాజ్యం పార్టీకి అధోగతి తప్పదని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. సీనియర్ నేత శివశంకర్ సోనియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదనీ, పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై వచ్చిన ఆరోపణలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సుధాకర్‌రెడ్డి సూచించారు. తాను చేసిన వ్యాఖ్యలకు శివశంకర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications