మొద్దు శీనును ఎందుకు చంపానంటే...

పెనుకొండ: కాంగ్రెస్‌ పాలనలో బీసీలకు, ముఖ్యంగా వాల్మీకులకు రక్షణ లేకుండా పోయిందని, వారి హత్యలకు ప్రతీకారంగానే మొద్దుశీనును చంపానని ఓంప్రకాష్‌ వెల్లడించాడు. శుక్రవారం అనంతపురం జిల్లా పెనుకొండ కోర్టుకు పోలీసులు తీసుకువచ్చిన సందర్భంగా అతడు విలేఖరులతో మాట్లాడాడు.

తగరకుంట ప్ర భాకర్‌ను నడిబజారులో అతి దారుణంగా హత్య చే యడం బాధ కలిగించిందన్నాడు. 'హత్యలు చేయడం వారికి మాత్రమే తెలుసా? మాకూ చేతనవుతుంది, అందుకే మొద్దుశీనును హత్య చేశా' అన్నాడు. దీనితో మద్దెలచెరువు సూరికి గానీ, ప్రభుత్వానికి గానీ, టీడీపీ నాయకులకు గానీ సంబంధం లేదన్నాడు. తనకు, తన భార్యకు బీసీలందరూ మద్దతుగా నిలవాలని కోరాడు.

పరిటాల రవి అంటే అభిమానం
టీడీపీ మద్దతుదారుడైన తనకు, పరిటాల రవి అంటే ఎంతోఅభిమానమనిపేర్కొన్నాడు. 'నేరాలు, శిక్షలు మానవాళికి తప్పవు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వంటి గొప్ప వ్యక్తే కటకటాల పా లైతే,రామకోటి రాసుకునే నేనెంత?' అని వేదాంతం వల్లించాడు సహాయం కోసం పరిటాల సునీత వద్దకు భార్యను పంపుతానన్నావు క దా? అన్న ప్రశ్నకు ఎమ్మెల్యేనే తనవద్దకు పిలిపించుకుంటానన్నాడు.

పోతుల సురేష్‌కు రోశయ్య అండ
ఆర్వోసీ నాయకుడు పోతుల సురేష్‌ వైశ్య కులస్తు డు కావడంవల్ల అతడు ఎన్‌కౌంటర్‌ కాకుండా అదే కులానికి చెందిన మంత్రి రోశయ్య కాపాడుతున్నా రని ఆరోపించాడు. బీసీలలో సరైన నాయకుడు లే నందువల్ల తానే వారందరికీ రక్షణ కల్పిస్తానని, ఇం దుకోసం వారంతా తనకు మద్దతునివ్వాలని కోరాడు. ఓంప్రకాష్‌కు ఈ నెల 21 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ బాలకోటేశ్వరరావు ఆదేశాలు జారీచేశారు.

చంచలగూడ జైలుకు తరలింపు
బుక్కరాయసముద్రం: ఓంప్రకాష్‌ను శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని చంచలగూడ జైలుకు తరలించినట్టు అనంతపురం జిల్లా జైలు ఇన్‌చార్జి సూ పరింటెండెంట్‌ రవిప్రసాద్‌ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+