జీలం నదిలో 20 మంది గల్లంతు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఆదివారంనాడు వంతెన కూలిపోవడంతో జీలం నదిలో పడిలో 20 మంది కూలీలు గల్లంతయ్యారు. కూలీలు వంతెన పనులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గల్లంతైనవారి కోసం అధికారులు అన్వేషణ ప్రారంభించారు. శ్రీనగర్ కు 92 కిలోమీటర్ల దూరంలో గల ఉరి పట్టణం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కూలీలు పని చేస్తుండగా పారంపిల వంతెన తెగిందని, దీంతో కూలీలు జీలంనదిలో పడ్డారని పోలీసులు చెప్పారు.
తాము గాయపడిన ఇద్దరు కూలీలను వెలికి తీయగలిగామని, మరో 20 మంది కోసం గాలిస్తున్నామని వారు చెప్పారు. వీరిలో చాలా మంది మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. కూలీల్లో కాశ్మీరీలే కాకుండా కాశ్మీరేతరులు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications