వైయస్ ప్రభుత్వంపై చిరు నిప్పులు

ప్రభుత్వ విధానాలన్నీ పైపై మెరుగులేనని, ప్రజాకర్షక పథకాలతో ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన అన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తున్నారు సరే కూరగాయల మాటేమిటని ఆయన ప్రశ్నించారు. అనంతపురం జిల్లా అక్షర క్రమంలో మొదట ఉన్నా అభివృద్ధిలో వెనకబడి ఉందని, దీనికి ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమని ఆయన అన్నారు. జిల్లాకు చెందిన ఎన్. రఘువీరా రెడ్డి వ్యవసాయ మంత్రిగా ఉన్నా ప్రజలను పట్టించుకోవడం లేదని ఆయన తప్పు పట్టారు. ఇంద్ర సినిమాలో రాయలసీమను స్పృశించిన అనుభూతి ఇంకా తనలో ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications