బలహీనపడుతున్న తుపాను
విశాఖపట్నం: నెల్లూరు జిల్లా కావలి వద్దవాయుగుండం తీరం దాటింది. దీంతో తుపాను క్రమంగా బలహీన పడుతోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమ, తెలంగాణల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో 24 గంటల పాటు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరులో సముద్రం ఉప్పొంగింది. వందలాది పడవలు కొట్టుకు పోయాయి. పలు చోట్ల పంటలు నష్టపోయాయి.
వాతావరణ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ తుపానుకు ఖైముక్ అని పేరు పెట్టారు. పరిస్థితిని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల యంత్రాంగం అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితి చక్కదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాత్రి నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేలాది ఎకరాల పంట నష్టమైంది.












Click it and Unblock the Notifications