చిరుది వెటరన్స్ జట్టే: కిరణ్ కుమార్
హైదరాబాద్: తన పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పిన ప్రజారాజ్యం అధినేత చిరంజీవి వెటరన్స్ టీంతోనే ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారం కోసమే కేంద్ర మాజీ మంత్రి పి. శివశంకర్ కాంగ్రెసుపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ఓడిపోయేవారిని భరించడానికి తాము సిద్ధంగా లేమని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరిన శివశంకర్ శనివారంనాడు కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. సోనియా గాంధీకి నైతిక విలువలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విమర్శలపై కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారంనాడు తీవ్రంగా ప్రతిస్పందించారు.












Click it and Unblock the Notifications